ప్రజాశక్తి-గుత్తి వేరుశనగ పంట సాగు చేసి నష్టపోయిన రైతుల కు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని తురకపల్లి, కొజ్జేపల్లి గ్రామాల్లోని రైతులు నాగన్న, బాలన్న సాగు చేసిన వేరుశనగ పంట పొలాలను సిపిఐ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యం త కరువు ప్రాంతమైన జిల్లారైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవా లన్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటలను సాగు చేస్తే వర్షాభావం వల్ల పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురాన్ని కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్, జిల్లా కార్యదర్శి జాఫర్, సహాయ కార్యదర్శి నారాయణస్వామి, నియోజకవర్గ కార్యదర్శి వీరభద్ర స్వామి, మండల కార్యదర్శి జి.రామదాసు, నాయకులు మధు, రామాంజనేయులు, ఉమర్ బాషా, గోపీనాథ్, దేవేంద్ర, రమేష్, మురళి పాల్గొన్నారు.
గార్లదిన్నె : పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం గార్లదిన్నె మండలంలోని ఎగువపల్లి గ్రామంలో సాగు చేసి ఎండిపోయిన వేరుశనగ, పతి, కంది, ఆముదం పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఎప్పుడూ ఎన్నికల గురించి ఆలోచించడం తప్ప ప్రజా సంక్షేమంపై లేదన్నారు. వెంటనే పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, తాలూకా కార్యదర్శి నారాయణస్వామి, నియోజకవర్గ కార్యదర్శి టి.నారాయణస్వామి, రైతుసంఘం కార్యదర్శి రాము, మల్లికార్జున, చెన్నప్ప, తదితరులు పాల్గొన్నారు.
గుత్తి మండలంలో వేరుశన పంటను పరిశీలిస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నాయకులు










