ప్రజాశక్తి - పెద్దకడబూరు
ఉపాధి హామీ చట్టం కింద మండలంలోని రైతులకు పండ్ల తోటల మొక్కలు పంపిణీ చేశారు. ఆదివారం ఎంపిడిఒ శ్రీనివాసరావు, మండల వ్యవసాయ మండలి ఛైర్మన్ పురుషోత్తమ రెడ్డి, రోడ్ల భవనాల శాఖ కమిటీ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, వైసిపి మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, పెద్దకడబూరు సర్పంచి రామాంజనేయులు, ముక్కరన్నలు రైతులకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ మాట్లాడారు. పండ్లతోటల పెంపకంలో భాగంగా మండలంలోని 20 గ్రామాల్లో, 107 మంది రైతులు ముందుకొచ్చారని తెలిపారు. 134 ఎకరాల్లో 17,030 మొక్కలను నాటేందుకు ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి సహకారంతో ఎంపిపి బి.శ్రీవిద్య ఆధ్వర్యంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల తీర్మానంతో అంచనాలు తయారు చేశామని చెప్పారు. మామిడి 168 మొక్కలు, కొబ్బరి 8,352 మొక్కలు, నల్లరేగడి పండ్లు 48 మొక్కలు, నిమ్మ 462 మొక్కలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ మొక్కలను అన్ని గ్రామాల్లో ఉపాధి సిబ్బంది, మేటీల సహకారంతో నాటించినట్లు చెప్పారు. ఇంకా 8 వేల మల్లె మొక్కలు రావాల్సి ఉందన్నారు.
మొక్కలను పంపిణీ చేస్తున్న ఎంపిడిఒ శ్రీనివాసరావు










