Jun 21,2023 17:29

సచివాలయాల్లో వినతిపత్రాలు ఇస్తున్న రైతు సంఘం నాయకులు

రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
ప్రజాశక్తి - నందికొట్కూరు

రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఎపి రైతు సంఘం నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు గ్రామ సచివాలయాలు ఆర్‌బికె సెంటర్ల దగ్గర వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామ సచివాలయం పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌ ఇవ్వడం వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఖరీఫ్‌ 2022 జిల్లాలో ఖరీఫ్‌ సీజన్లో అతివృష్టి, అనావృష్టి వల్ల అన్ని రకాల పంటలు పూర్తిగా దెబ్బతి న్నాయని అన్నారు. రైతులు అప్పుల ఊబిలో కుర్రుకుపోయారన్నారు. ఇంతవరకు రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వకపోవడం బాధాకరమ న్నారు. ప్రభుత్వం ఆర్బికే సెంటర్లలో కొనుగోలు చేస్తామని చెప్పి ఏ ఒక్క సెంటర్లోనూ ధాన్యం కొనుగోలు చేయలేదన్నారు. ప్రభుత్వం తక్షణమే 2021-22 రైతుల పంటల అభిమా ప్రకటించి రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఆర్బికే సెంటర్లలో ఎరువులు,విత్తనాలు అందుబాటులో ఉంచి నకిలీ విత్తనాలను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు బి రామ నాయుడు, పి మాధవ నాయుడు, కే మాధవస్వామి, గోపాల్‌, నారాయణ, సయ్యద్‌ బాష, దామోదర్‌ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.