Mar 23,2023 21:24

ప్రజాశక్తి - జీలుగుమిల్లి
               ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వ్యవసాయ అధికారి కె.గంగాధర్‌ తెలిపారు. పంట నమోదు చేసుకున్న రైతులు వారి పంట నష్టాన్ని రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న వ్యవసాయ సహాయకులకు తెలియజేయాలని సూచించారు. అకాల వర్షాలకు నష్టపోయిన పొగాకు, మొక్కజొన్న పంటలను గురువారం క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలించారు. మండలవ్యాప్తంగా సుమారు మొక్కజొన్న 300 ఎకరాల వరకు, పొగాకు 200 ఎకరాల వరకు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంట ఇ-క్రాప్‌లో నమోదై 33 శాతం కంటే ఎక్కువగా నష్టపోయిన పంటల వివరాలను ఆర్‌బికె అసిస్టెంట్లతో నమోదు చేపిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా పంట నష్టపోయిన రైతులు ఆయా రైతు భరోసా కేంద్రాల్లో నమోదు తెలిపినట్లయితే సిబ్బంది క్షేత్ర స్థాయిలోకి వచ్చి పంట వివరాలు తీసుకుంటారని తెలిపారు.