Jun 15,2023 00:58

ప్రజాశక్తి-కోటనందూరు తేటగుంట గ్రామంలో భారీ పెనుగాలులకు నష్టపోయిన రైతులను మంత్రి దాడిశెట్టి రాజా బుధవారం పరామర్శించారు. తేటగుంట గ్రామంలో పర్యటించారు. కొబ్బరి రైతులను, అరటి రైతులను, ఇళ్లు కూలిపోయిన కూలిపోయిన వారితో మాట్లాడారు. అనంతరం అధికారులతో మాట్లాడి పంట నష్టం తీవ్రతను అంచనా వేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. నష్టపోయిన బాధితులకు అందరికీ ఒక్కొక్కరికీ రూ.5000 నగదు, 5 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులను మంత్రి రాజా అందజేశారు. ప్రభుత్వపరంగా నష్టపరిహారాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌తో చర్చించి రైతులను పూర్తిస్థాయిలో ఆదుకుంటామనిభరోసా ఇచ్చారు. ఆయన వెంట మండల వ్యవసాయ శాఖ అడ్వైజర్‌ కమిటీ చైర్మన్‌ సోడ్రాజు రాంబాబు రాజు, స్థానిక సర్పంచ్‌ అతి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.