Apr 02,2023 00:10

జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రావు

ప్రజాశక్తి -నక్కపల్లి :ఈకేవైసీ నమోదు కాని రైతులను గుర్తించి వెంటనే చేయించాలని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రావు ఆర్‌బికే సిబ్బందికి సూచించారు. నక్కపల్లిలో శనివారం రైతు భరోసా కేంద్రంలో ఆర్‌.బి.కె సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నక్కపల్లి మండలంలో పిఎం కిసాన్‌ 14564 లబ్ధిదారులకు అందుతుందని, సుమారుగా 2,017 రైతులు ఈకేవైసీ నమోదు చేయించకపోవడంతో వారికి లబ్ది అందలేదన్నారు. వెంటనే ఆర్‌బికే సిబ్బంది వాలంటీర్ల సాయంతో ఈకేవైసీ నమోదు కాని రైతులకు చేయించాలని సూచించారు. పీఎం కిసాన్‌ లబ్ది రైతులందరికీ అందాలని, రైతులు వేసవిలో చిరు ధాన్యాలు వేసుకునేలా అవగాహన కల్పించి ప్రోత్సహించాలని సూచించారు. ఖరీఫ్‌లో వేస్తున్న పంటలు క్రాప్‌ బుకింగ్‌ ప్రణాళిక వేసుకోవాలన్నారు. కియాస్కో పనితీరు, వైఎస్‌ఆర్‌ యంత్ర సేవపై ఆర్‌బికే సిబ్బందికి అవగాహన కల్పించి, పక్కాగా అమలు చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట వ్యవసాయ సహాయ సంచాలకులు టి ఎస్‌ రాజ్‌ కమల్‌, ఏవో ఉమా ప్రసాద్‌, ఆర్‌బికే సిబ్బంది పాల్గొన్నారు.