
ప్రజాశక్తి - పెనుమంట్ర
సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమంలో భాగంగా రైతులకు బ్రోమోడయోలిన్ మందును ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేసినట్లు ఎఒ ఎ.జ్యోషిల తెలిపారు. మండల పరిధిలోని 19 రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు, కౌలు రైతులకు పంపిణీ చేశారు. మండలంలో 13,400 ఎకరాల్లో మందును రైతుల ద్వారా పెట్టించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సోమరాజు ఇల్లింద్రపర్రులో ఎంపిపి కర్రి వెంకటనారాయణరెడ్డి (వాసురెడ్డి) ఆధ్వర్యంలో సర్పంచి వనుం సూర్యనారాయణ చేతులమీదుగా పంపిణీ చేశారు. పెనుమంట్రలో సర్పంచి తాడిపర్తి ప్రియాంక, ఎఎంసి ఛైర్మన్ వెలగల వెంకటరమణ (మిస్సమ్మ) ఆధ్వర్యంలో ఎంపిడిఒ పి.పద్మజ, తహశీల్దార్ దండు అశోక్‌వర్మ చేతుల మీదుగా అందించారు. మాముడూరులో సర్పంచి, వైసిపి మండల కన్వీనర్ గూడూరి దేవేంద్రుడు ఆధ్వర్యంలో సొసైటీ ప్రెసిడెంట్ దాట్ల గోపాలకృష్ణంరాజు (చంటి రాజు), వైస్ ఎంపిపి వాసంశెట్టి కిరణ్ చేతులమీదుగా అందించారు. జుత్తిగలో సర్పంచి, మండల సర్పంచుల అధ్యక్షుడు తమనంపూడి వీర్రెడ్డి, మండల వ్యవసాయ సలహా మండల కమిటీ ఛైర్మన్ కొవ్వూరి రామకృష్ణ సూర్య సత్యనారాయణరెడ్డి (చిన్నారెడ్డి)తో పాటు ఆయా గ్రామాల్లో సర్పంచులు, ఎంపిటిసి సభ్యుల ఆధ్వర్యం లో రైతులకు ఉచితంగా ఎలుకల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
మొగల్తూరు : అన్నదాతలు సామూహికంగా ఎలుకల నిర్మూలన కార్యక్రమం చేపట్టి అధిక దిగుబడి పొందాలని జెడ్‌పిటిసి సభ్యులు తిరుమని బాపూజీ అన్నారు. మొగల్తూరు పంచాయతీ పరిధి గొల్లగూడెంలో అన్నదాతలకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎలుకల నిర్మూలన మందు పంపిణీ కార్యక్రమాన్ని ఆ శాఖ అధికారి అబ్దుల్ రహీం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అవసరమైన మేరకు ఎరువులు, పురుగు మందులు వినియోగించి నాణ్యమైన దిగుబడిని సాధించాలని ఆయన రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి కైలా సుబ్బారావు, కవురు సీతామహాలక్ష్మి, కంచర్ల బాబు, పలువురు రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
గణపవరం : మండలంలో సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమంలో భాగంగా స్థానిక రైతు భరోసా కేంద్రాల వద్ద రైతులకు బ్రోమోడయోలిన్ మందును ఎఒ ప్రసాద్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12,825 ఎకరాలకు 2,955 కేజీల ఎలుకలు మందును రైతులకు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, రైతులు పాల్గొన్నారు.