సమావేశంలో మాట్లాడుతున్న మీరయ్య
ప్రజాశక్తి-భట్టిప్రోలు: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న దృష్ట్యా రైతులకు పచ్చి రొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఎంపిపి డివి లలితకుమారి తెలిపారు. మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ సిబ్బంది నిరంతరం రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. 50 శాతం రాయితీపై అందిస్తున్న జనుము, జీలుగా విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ మీరయ్య, కమిటీ చైర్మన్ కుందేటి రమేష్, విఏఏలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.










