రైతులకు అందుబాటులో నాణ్యమైన ఎరువులు
ప్రజాశక్తి-యర్రావారిపాలెం: రైతులకు అందుబాటులో నాణ్యమైన ఎరువులు వున్నాయని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ప్రసాద్‌రావు పేర్కొన్నారు. మండలంలోని కమలయ్యగారిపల్లి పంచాయతీ మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రాలను జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ ప్రసాద్ రావు, ఏడిఏ ధనుంజయరెడ్డి మంగళ వారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాల్లో రికార్డులను ఎరువుల స్టాకును పరిశీలించారు. అనం తరం వారు మాట్లాడుతూ స్థానికంగా ఉన్న రైతు భరోసా కేంద్రాలలో నాణ్యమైన ఎరువులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతులు పండిస్తున్న పంటల పరిస్థితిని అడిగి తెలుసుకుని వాటికి సూచనలు సలహాలు ఇచ్చారు. ఆర్‌బికెలలో యూరియా, డిఎపి సబ్సిడీ ధరలకే లభిస్తుందని వాటిని రైతులు ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఖాదర్ బాషా, సిబ్బంది మునిశేఖర్, సాయి కష్ణ, రైతులు పాల్గొన్నారు.










