
ప్రజాశక్తి-మండపేట
వైసిపి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని మండపేట పురపాలక సంఘం ఛైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి పేర్కొన్నారు. మండపేట వల్లూరి అప్పారావు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె మంగళవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి సొసైటీ అధ్యక్షులు పెంకే గంగాధరం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా వైసిపి రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్, మునిసిపల్ కో అప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ధాన్యం కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం సొమ్ములు సకాలంలో రైతుల ఖాతా కు జమ అవుతాయన్నారు. పూర్తి పారదర్శకంగా కొనుగోలు కేంద్రాలు పనిచేస్తాయని పేర్కొన్నారు. సిఎం జగన్ రైతు పక్షపాతి అని కొనియాడారు. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న వివిధ పథకాలు వివరించారు. కార్యక్రమంలో ముక్కా దాలయ్య సొసైటీ సిఇఒ చిర్ల సుబ్రహ్మణ్యం, విఆర్‌ఒలు పాల్గొన్నారు.