ప్రజాశక్తి - కాళ్ల
రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, సహకార బ్యాంకు ద్వారా పార్టీలకతీతంగా రైతులకు సేవలందిస్తామని కలవపూడి సహకార సంఘం ఛైర్మన్ బర్రె గంటయ్య అన్నారు. కలవపూడి వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో సొసైటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో సహకార సంఘం ఛైర్మన్ బర్రె గంటయ్య మాట్లాడుతూ సహకార బ్యాంకు అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు. రైతులకు అవసరమైన రుణాలు ఎప్పటికప్పుడు అందిస్తూ వారి అభివృద్ధికి దోహదపడుతున్నామన్నారు. డిసిసిబి ఛైర్మన్ పివిఎల్ నరసింహరాజు తనదైన శైలిలో రైతుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. సభ్యులు, సిబ్బంది సహకారంతో సొసైటీని మరింత అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు పెనుమత్స దుర్గా ప్రసాదరాజు, యాళ్ల నందమ్మ, సొసైటీ సిఇఒ కనుమూరి శ్రీరామ వెంకట సత్య నరసింహరాజు (మణి) పాల్గొన్నారు.