ప్రజాశక్తి-కంచికచర్ల
రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విశేష కృషి చేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్‌రావు పేర్కొన్నారు. కేడీసీసీబీ నిధులు 52 లక్షల రూపాయలు వ్యయంతో కంచికచర్ల లో కెడిసిసి బ్యాంక్ బ్రాంచ్ విస్తరణలో భాగంగా నిర్మించిన మొదటి అంతస్తు భవనాన్ని శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, కేడీసీసీబీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేడీసీసీబీ ద్వారా రైతులకు పెద్ద ఎత్తున సబ్సిడీ రుణాలు, వ్యవసాయ రుణాలు మంజూరు చేస్తూ వారి అభివద్ధికి కూడా తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ గత పాలకులు రైతు సంక్షేమాన్ని నిర్వీర్యం చేశారని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతు ప్రభుత్వంగా మార్చారన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, కేడీసీసీబీ డైరెక్టర్ కొమ్మినేని రవిశంకర్, డిసిసిబి డైరెక్టర్ బండి జానకి రామయ్య, జడ్పిటిసి వేల్పుల ప్రశాంతి, ఎంపిపి, వైస్ ఎంపీపీ లు షేక్ మలక్ బషీర్, బండి మల్లికార్జునరావు, గ్రామ సర్పంచ్ ఉప సర్పంచులు వేల్పుల సునీత, వేమా సురేష్ బాబు పాల్గొన్నారు.










