Aug 25,2023 22:34

మాట్లాడుతున్న నిరంజన్‌బాబు రెడ్డి

ప్రజాశక్తి-నెల్లూరు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత నిస్తూ రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ దొడ్డంరెడ్డి నిరంజన్‌ బాబు రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ దొడ్డంరెడ్డి నిరంజన్‌ బాబు రెడ్డి అధ్యక్షతన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత నిస్తూ రైతుల అభివద్దికి రాష్ట్ర ప్రభుత్వం కషి చేస్తున్నదన్నారు. ఈ క్రాప్‌ బుకింగ్‌, ఈకెవైసి చేసుకుంటేనే ప్రభుత్వ పధకాలు రైతులకు వర్తించడం జరుగుతుందని, ఈ విషయం పై జిల్లాలోని రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ఈ క్రాప్‌ బుకింగ్‌, ఈకెవైసి ప్రక్రియను నూటికి నూరు శాతం పూర్తి చేసి రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణలో భాగంగా డ్రోన్‌ విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. జిల్లాలో ఇప్పటికే 18 మందికి డ్రోన్‌ పైలెట్స్‌ గా శిక్షణ ఇచ్చామని, మరి కొంత మందికి శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ధాన్యం సేకరణలో భాగంగా రవాణా, హమాలీ ఛార్జీలు జిల్లాలో ఇంకా చెల్లించాల్సి వుందని, వాటిని త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించారు. ఉద్యాన శాఖ ద్వారా పెరటి మొక్కలను పంపిణీ చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడ ఎరువుల కొరత లేదన్నారు. నేడు ధాన్యానికి గిట్టుబాటు ధర కంటే ఎక్కువ ధర మార్కెట్‌ లో లభిస్తున్నందున రైతులు సంతోషంగా వున్నారన్నారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయానికి అవసరమైన సలహాలు సూచనలను రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించడం జరుగుచున్నదని, రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టర్‌ యం. హరి నారాయణన్‌ మాట్లాడుతూ, గ్రామ, మండల వ్యవసాయ సలహా మండలి సమావేశాల్లో సూచనలు, సలహాలను పరిగణలోనికి తీసుకుని జిల్లా స్థాయిలో చర్చించి ప్రభుత్వానికి నివేదించి , అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఖరీఫ్‌, రభీ పంటకాలాల్లో తప్పనిసరిగా ఈ క్రాప్‌ ద్వారా రైతులు తమ పంటలను నమోదు చేసుకోవాలన్నారు. పకతి వైపరీత్యాలు, దాన్యం కొనుగోలు, రాయితీపై విత్తనాలు, సున్నా వడ్డీ పంటల రుణాలు, పంటల భీమా, ఎరువులు, పురుగు మందుల సబ్సిడీ ఈ క్రాప్‌ డేటా ద్వారానే రైతులు పొందగలరన్నారు. ఈ క్రాపు నమోదులో వ్యవసాయ అధికారులతో పాటు రైతులు కూడా అంతే బాధ్యత ఉండాలన్నారు.జాయింట్‌ కలెక్టర్‌ శ్రీ కూర్మనాథ్‌ మాట్లాడుతూ, రైతులు నష్టపోకుండా పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా అన్నీ చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. జిల్లాలో నూటికి నూరు శాతం ఈ క్రాప్‌ బుకింగ్‌, ఈకెవైసి ప్రక్రియ పూర్తి చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక దష్టి సారించాలన్నారు. ఈక్రాప్‌ బుకింగ్‌ నమోదులో క్షేత్ర స్థాయిలో పొరపాట్లుకు తావులేకుండా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఇబ్బంది పడకుండా ఇప్పటినుండే అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. తొలుత జిల్లాలో వ్యవసాయ దాని అనుబంధశాఖలైన ఉద్యాన శాఖ, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ, మైక్రో ఇరిగేషన్‌, మార్క్‌ ఫెడ్‌, మార్కెటింగ్‌ శాఖ అధికారులు, ఆయా శాఖల ద్వారా రైతుల సంక్షేమానికి, అభివద్దికి చేపడుతున్న కార్యక్రమాల వివరాలను గత వ్యవసాయ సలహా మండలి సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలపై వివరించారు. ఈ సమావేశంలో హార్టికల్చర్‌ యూనివర్సిటీ విశ్వ బోర్డు మెంబర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్‌ రాజు, ఉద్యాన శాఖాధికారి ఎం.వి. సుబ్బారెడ్డి, పశు సంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కోటేశ్వర రావు, మార్క్‌ ఫెడ్‌ డి.ఎం పవన్‌, ఎల్డిఎం టి. శ్రీకాంత్‌ ప్రదీప్‌ కుమార్‌, ఏ.పి.ఎం.ఐ.పి పిడి శ్రీనివాసులు, ఏ.డి. మార్కెటింగ్‌ అనిత కుమారి, ఇరిగేషన్‌, పౌర సరఫరాల శాఖ, మత్స్య శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.