రాయచోటి : విత్తనం మంచిదైతే పంట బాగుంటుంది. పంట కళకళలాడితే దిగుబడి దిగు లుండదు. దిగుబడి, ధరలూ బాగుంటే ఇక రైతన్నకు తిరుగుం డదు. అంతా సవ్యంగా జరగాల్లంటే మేలి రకం విత్తనం కావాలి. అన్నదాతలు నకిలీ విత్తనాలతో మోసపోకుండా వైఎస్సార్ అగ్రి ల్యాబ్స్ భరోసా కల్పిస్తున్నాయి. ఏటా రూ.వేల కోట్ల పెట్టుబడి మట్టి పాలు కాకుండా కాపాడుతున్నాయి. పైసా ఖర్చు లేకుండా ఇన్‌పుట్స్‌ను ముందుగానే పరీక్షించుకోవడం ద్వారా నాసిరకం బారిన పడకుండా ధైర్యంగా సాగు పనులు చేపడుతు న్నామని రైతన్నలు ఆనందంగా చెబుతున్నారు. నాణ్యమైన ధ్రువీకరించిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇప్పటికే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే రైతులకు అందుబా టులోకి వచ్చాయి. ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటవుతున్న వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ నాణ్యత పరీక్షలతో రైతుకు భరోసా కల్పిస్తున్నాయి.
జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, మదనపల్లి, తంబళ్లపల్లిలో కేంద్రాలు సేవలందిస్తుండగా కొద్ది నెలల్లోనే పీలేరు నియోజకవర్గంలోని ల్యాబ్ కూడా ప్రారంభానికి నోచుకోనుంది. ఆర్బీకేల ద్వారా సరఫరా చేసే ఇన్‌పుట్స్‌తో పాటు మార్కెట్‌లోకి వచ్చే ప్రతీ ఇన్‌పుట్ శాంపిల్‌ను ఇక్కడ పరీక్షించుకునే సదుపాయం ఉండటం వల్ల రైతుల్లో నమ్మకం పెరుగుతోంది. సొంతంగా తయారు చేసుకున్న విత్తనమైనా, మార్కెట్‌లో కొనుగోలు చేసినవైనా నేరుగా ఈ ల్యాబ్‌కు వెళ్లి నాణ్యతను ఉచితంగా పరీక్షించు కోవచ్చు. విత్తనమే కాకుండా ఎరువులు, పురుగు మందుల నాణ్యతను కూడా పరీక్షించుకుని ధీమాగా సాగు పనులు చేపట్టవచ్చు. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలతో చాలా సేవలు రైతులకు సులువుగా చేరువ య్యాయి. ఇప్పుడు ఈ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌ల తో వ్యవ'సాయం' మరింత సులువు కానుంది.
ప్రతి ల్యాబ్‌లో ఆటోమెషన్
నమూనాల పరీక్ష కోసం ప్రత్యేకంగా ఆటోమేటెడ్ క్వాలిటీ కంట్రోల్ యాప్ (ఇన్‌సైట్) అభి వద్ధి చేశారు. ఫలితాలను ట్యాంపర్ చేసేందుకు వీల్లేని రీతిలో ప్రతి లేబరేటరీలో ఆటోమేషన్ ఏర్పా టు చేశారు. టెస్టింగ్ చేసిన ప్రతీ ఒక్కటి రికార్డు కావ డంతో పాటు ఫలితాలు ఆటోమేటిక్‌గా సిస్టమ్‌లో నమోదవుతాయి. ఏ ల్యాబ్‌లో ఏ బ్యాచ్ శాంపిల్‌ను ఏ సమయంలో పరీక్షించారో నిర్ధారిస్తూ ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా ఈ టెక్నాలజీ నమోదు చేస్తుంది.
వ్యవసాయానికి అండగా..
వ్యవసాయ రంగానికి అండగా ప్రభుత్వం వైఎస్సార్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయం. ఈ జిల్లాలో వ్యవసాయ రంగం తోపాటు పాడి రంగాల్లో రైతులు ఆధారపడి జీవిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆయా ప్రాంతాలను బట్టి ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం మంచి పరిణామం.
- దామోదర్‌రెడ్డి, రైతు పోనేటిపాలెం, మదనపల్లి.
ఎప్పటికప్పుడు ఫలితాలు
జిల్లాలో ఇప్పటికే ఐదు ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ లు సేవలు అందుబాటులోకి వచ్చాయి. మరొకటి నిర్మాణం పురోగతి దశలో ఉంది. కొద్ది నెలల్లోనే పూర్తి వినియోగంలోకి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. గతంలో చాలా ఆలస్యంగా పరీక్షల ఫలితాలు వచ్చేవి. ఇప్పుడు ల్యాబ్‌లు విరివిగా ఏర్పాటు చేయడం వలన ఆ సమస్య ఎదురుకాదు. ఎప్పటికప్పుడు ఫలితాలు రావడం వల్ల రైతులు నాణ్య మైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వాడటా నికి వీలు పడుతుంది.
- చంద్రనాయక్, జెడిఎ, అన్నమయ్య జిల్లా.
శాశ్వత వ్యవస్థ.. సిఎం సంకల్పం
రైతులకు నాణ్యమైన ఇన్‌పుట్స్ ఇవ్వ డానికి శాశ్వతంగా ఓ వ్యవస్థ ఏర్పాటు చేయా లన్నది సిఎం జగన్ మోహన్‌రెడ్డి సంకల్పం. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లను తీసుకొచ్చాం. జిల్లాలో ఆరు ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌ల్లో ఐదు వినియోగంలో ఉన్నాయి. మరొకటి పురోగతి నిర్మాణం దశలో ఉంది. వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి చర్యలు చేసు కుంటున్నాం. ఆర్బీకేలో కూడా టెస్టింగ్ కిట్స్ పెట్టాం.
- గిరీష, కలెక్టర్, అన్నమయ్య జిల్లా.










