Jul 30,2023 21:21

రైతుల ప్రయోజనమే పరమావధిరైతు ప్రయోజనమే పరమావధిగా పని చేస్తాం.

ఈ-నామ్‌ వంటి ఆధునిక మార్కెటింగ్‌ వ్యవస్థ ద్వారా దేశీయ మార్కెట్‌ను రైతు ముంగిటకు చేరువ చేశాం. ఫలితంగా జిల్లాలోని రైతాంగ ఉత్పత్తులకు దేశంలోని ఏయే మార్కెట్లలో ఎటువంటి గిరాకీ ఉందో ముందుగానే తెలుసుకునే సౌలభ్యం కలిగింది. రాయలసీమ రీజియన్‌ పరిధిలో 74 మార్కెట్‌యార్డు వివరాలను అందుబాటులో తెచ్చాం. పత్తి ఎంఎస్‌పి ధరలు ఏటా పెరుగు తున్న నేపథ్యంలో సిసిఎ ద్వారా పత్తి కొనుగోలు చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. రీజియన్‌ పరిధిలోని 259 గోడౌన్లలో వ్యవసాయ ఉత్పత్తు లను నిల్వ చేసుకునే సదుపాయాన్ని కల్పించాం. మార్కెట్లో మెరుగైన ధర లభించినప్పుడు విక్రయించుకునే అవకాశం ఉందని పేర్కొంటున్న రాయల సీమ రీజియన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ చల్లా రామాంజనేయులుతో ప్రజాశక్తి ముఖాముఖి...
-ప్రజాశక్తి - కడపప్రతినిధిమార్కెట్‌యార్డుల వివరాలు తెలపండి?
రీజియన్‌ పరిధిలో 74 మార్కెట్‌యార్డులున్నాయి. కడప, చిత్తూరు, అనం తపురం, కర్నూలు జిల్లాల్లోని మార్కెట్‌ యార్డుల ద్వారా ఈ- నామ్‌ తదితర సేవల ద్వారా మెరుగైన సేవల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తున్నాం.
మార్కెట్‌ లావాదేవీల గురించి తెలపండి?
2022-2023లోరూ.120 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవడమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ నాటికి తిరుపతి మార్కెట్‌యార్డు మినహా మిగిలిన మార్కె ట్‌యార్డులన్నీ పురోగమన దిశలో పయనిస్తుండడం ఆహ్వానించదగిన విషయం. మిగిలిన తొమ్మిది నెలల వ్యవధిలో రూ.122 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని సునాయాసంగా చేరు కునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం.
గోడౌన్ల సామర్థ్య వివరాలు తెలపండి?
రాయలసీమ రీజియన్‌ పరిధిలో 259 గోడౌన్లున్నాయి. 2,11,735 టన్నుల నిల్వ సామ ర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. కడపలోని 39 గోడౌన్లలో 30,315 టన్నులు, అనంతపురంలోని 44 గోడౌ న్లలో 30,120 టన్నులు, చిత్తూరులోని 18 గోడౌ న్లలో 17,950 టన్నులు, కర్నూలులోని 32 గోడౌన్లలో 35,940 టన్నులు, నంద్యాలలోని 41 గోడౌన్లలో 41, 600 టన్నులు, తిరుప తిలోని 34 గోడౌన్ల లో 27, 100 టన్నులు, అన్న మయ్యలోని 21 గోడౌన్లలో 9,160 టన్నులు, సత్య సాయి జిల్లాలోని 30 గోడౌన్లలో 19,650 మెట్రిక్‌ టన్నుల మేర వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసు కునే అవకాశం ఉంది.
ఆదోని మార్కెట్‌ పురోగతిని వివరించండి?
రీజియన్‌ పరిధిలో అధిక ఆదాయం ఆదోని మార్కెట్‌ యార్డు ద్వారా సమకూరుతోంది. 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.16 కోట్ల ఆదాయం సంపాదించింది. ఇక్కడికి కర్నాటకలోని రాయచూర్‌, తెలంగాణాలోని గద్వాల్‌ తదితర ప్రాం తాల నుంచి సరుకుల లావాదేవీలు ఉన్నాయి. ఫలితంగా ఆధోని మార్కెట్‌యార్డు అత్యధిక ఆదాయాన్ని సమకూర్చు తోంది.
చెక్‌పోస్టుల వివరాలు, ఉనికి గురించి తెలపండి?
రీజియన్‌ పరిధిలో 155 చెక్‌పో స్టులున్నాయి. అనంతపురం జిల్లాలో 32, చిత్తూ రులో 60, కడపలో 28, కర్నూలు జిల్లాలో 35 చెక్‌ పోస్టులున్నాయి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తీసుకొచ్చిన సంస్కరణల్లో భాగంగా చెక్‌పోస్టుల ద్వారా సెస్సుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గింది.
సిసిఎ ఏర్పాటు గురించి వివరించండి?
ప్రొద్దుటూరులో సిసిఎ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. విభ జిత వైఎస్‌ఆర్‌ జిల్లావ్యాప్తంగా 55 వేల ఎకరాల్లో పత్తి పంట పెద్దఎత్తున సాగవుతోంది. ప్రతియేటా పెద్దఎత్తున దిగుబడుల నేపథ్యంలో ప్రొద్దుటూరు సిసిఎ కేంద్రాన్ని సీజన్‌ సమయంలో సిసిఎ ఆధ్వర్యంలో పత్తి సేకరణ చేపడుతోంది. ఇటీవల ఆర్‌బికె వ్యవస్థ అందుబాటులోకి రావడం ద్వారా ఆర్బీకేల ద్వారా సేకరించిన పత్తిని మిల్లర్లకు సరఫరా చేయడం జరుగుతోంది. దీంతో సిసిఎ ఏర్పాటుపై స్పష్టత రావాల్సి ఉంది.
రీజియన్‌ మార్కెట్లలోని క్రయ,విక్రయాల గురించి తెలపండి?
రీజియన్‌ పరిధిలోని మార్కెట్లలో అత్య ధికంగా ఆధోని మార్కె ట్‌లో వ్యాపార కార్య కలా పాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పత్తి, వేరుశనగ, కందులు, పసుపు, టమోటో, మా మిడి, కూరగాయలు, వాము మొదలగు ఇతర పంటల క్రయవిక్రయాల జోరు కొనసాగుతోంది.