ప్రజాశక్తి-పాడేరు: రైతుల ఆర్ధికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ ఎంవి నాగి రెడ్డి తెలిపారు. బుధవారం ఐటిడిఏ సమావేశ మందిరంలో వ్యవసాయానుబంధ రంగాల అధికారులు, గిరిజన రైతులతో వ్యవసాభివృధ్ధిపై ముఖాముఖి చర్చా కార్యక్రమాన్ని నిర్వహించి రైతుల అభిప్రాయ సేకరణ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయానుబంధ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.83 వేల కోట్లు కేటాయించిందన్నారు. రైతు భరోసా కింద రైతులకు రూ.25 వేల కోట్లు చెల్లించారని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయం వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయని చెప్పారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 96 శాతం ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. రైతులకు ప్రభుత్వ పథకాలు, పాలసీలపై అవగాహన ఉండాలని పేర్కొన్నారు. కాఫీని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయడానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళతానని చెప్పారు.
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, ప్రాధాన్యతా రంగాలకు బ్యాంకుల నుండి రుణాల మంజూరు చేయడానికి కృషి చేస్తామన్నారు. గిరిజన రైతులకు పంట రుణాలు అందించడానికి బ్యాంకర్లతో చర్చించాలని ఎల్‌డిఎంను ఆదేశించారు. ప్రభుత్వ పాలసీలు, రైతు భరోసా కేంద్రాలు, వ్యవసాయం, ఉద్యాన వన పద్దతులు ఇ క్రాప్, పంటల బీమాపై చర్చించడం జరుగుతోందని చెప్పారు.
అరకు పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి మాట్లాడుతూ, లెమెన్ గ్రాస్ సాగును ఏజెన్సీలో ప్రోత్సహించాలని చెప్పారు. అధిక దిగుబడులు సాధించడానికి గిరిజన రైతులకు ఉత్తమ సేవలు అందించాలని వ్యవసాయాధికారులకు సూచిం చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గిరిజన రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతు భరోసా ప్రోత్సాహకాలను వ్యవసాయ పనులకు వినియోగించాలన్నారు నూతన పంటల సాగును వ్యవసాయ శాఖ ప్రోత్సహించాలని చెప్పారు. శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలన్నారు.
జిల్లా పరిషత్ అధ్యక్షురాలు జె.సుభద్ర మాట్లాడుతూ, రైతులకు రాయితీపై వ్యవసాయ రుణాలు అందించాలన్నారు. రాజ్మా విత్తనాలు, చిక్కుల్లు, సోయా విత్తనాలు పూర్తి స్థాయిలో సరఫరా చేయాలని సూచించారు. సబ్సిడీపై గిరిజనులకు పాడి పశువులను పంపిణీ చేయాలని పేర్కొన్నారు.
పాడేరు శాసన సభ్యురాలు కొట్ట గుల్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, ఏజెన్సీలో ఫుడ్ ప్రోసెస్సింగ్ యూనిట్లు నెలకొల్పాలన్నారు. ప్రభుత్వం ప్రాధాన్యత భవన నిర్మాణాల మాదిరిగా చెక్ డ్యాం నిర్మాణాలు చేపట్టి రైతులకు సాగు నీరందించాలని అన్నారు. మిరియాల సాగు రైతుల ఆర్ధికాభివద్ధికి దోహద పడుతుందన్నారు.గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా ఉద్యాన వన తోటులు పెంచాలని చెప్పారు.
అరకు శాసన సభ్యులు చెట్టి పాల్గుణ మాట్లాడుతూ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలన్నారు. పాడేరు, అరకు వ్యాలీలో శీతల గిడ్డంగులు నెల కొల్పితే గిరిజన ఉత్పత్తులకు మంచి గిట్టు బాటు ధర లభిస్తుందని పేర్కొన్నారు. ఏజెన్సీల అపారమైన జలసంపద ఉన్నాదని, చెక్ డ్యాంల నిర్మాణాలు చేపట్టి రైతులకు సాగునీరందించాలని చెప్పారు.
జిసిసి చైర్పర్సన్ శోభ స్వాతి రాణి మాట్లాడుతూ 2019లో 30 క్వింటాళ్ల పసుపును జిసిసి ద్వారా కొనుగోలు చేసామన్నారు. మూడు సంవత్సరాలకు సరిపడా పసుపు నిల్వలు ఉన్నాయన్నారు. రూ.కాఫీ రైతులకు అందించామన్నారు.
ట్రైకార్ చైర్మన్ శతక బుల్లిబాబు మాట్లాడుతూ రూ.36 కోట్ల రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ చేసామన్నారు. వ్యవసా రంగంలో సాధించడానికి అధిక దిగుబడులు రైతులకు సస్యరక్షణ పద్ధతులు పై అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో ఐటిడిఏ ఇన్చార్జి పిఓ, సబ్ కలెక్టర్ వి.అభిషేక్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్.బి.ఎస్ నంద్, వ్యవసాయ మిషన్ సభ్యులు జె.రామారావు, జిల్లా వ్యవసాయ సలహా బోర్డు చైర్ పర్సన్ సరస్వతి, డిసిఎంఎస్ చైర్ పర్సన్ పి.చిన్నతల్లి, డిసిసిబి చైర్ పర్సన్ సి.హెచ్. అనిత, 11 మండలాల వ్యవసాధికారులు, ఉద్యాన వన శాఖ, పశు సంవర్ధక, కాఫీ అధికారులు, రైతులు పాల్గొన్నారు.










