సన్మానిస్తున్న దృశ్యం
రైతుల అభివద్ధికి కృషి
ప్రజాశక్తి-సీతారామపురం:మెట్ట ప్రాంత రైతుల అభివద్ధికి కషి చేయాలని సొసైటీ చైర్మన్ రామిశెట్టి తిరుపతయ్యను మాజీ ఎంపీపీ, మాజీ సొసైటీ అధ్యక్షుడు కల్లూరి జనార్దన్ రెడ్డిలు కోరారు. శనివారం స్థానిక సొసైటీ కార్యాలయంలో రామిశెట్టి తిరుపతయ్యకు శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కల్లూరి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోనే అత్యంత వెనుకబడిన మెట్ట ప్రాంతమైన మండలం లోని రైతుల అభివద్ధికి పనిచేస్తూ వారికి సకాలంలో ఎరువులను రుణాలను అందించాలని కోరారు. అదేవిధంగా రైతుల సమస్యలను ఉన్నత అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలియజేస్తూ నిధులను రాబట్టుకుని రైతులకు చేయూతనివ్వాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల శ్రేయస్సుకు అనేక పథకాలను ప్రవేశపెట్టి రైతులకు లబ్ధించేకూరుస్తున్నారన్నారు. సొసైటీల ద్వారా వీలైనంతగా మండలంలో లబ్ధిదారులను గుర్తించి పేద రైతులకు ప్రభుత్వ పథకాల లబ్ధి అందేలా చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో బాలాయపల్లి సర్పంచ్ కల్లూరి వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ పానెం చంద్రమౌళి, సీనియర్ వైసీపీ నాయకులు తిరుమలరెడ్డి, రామ్మోహన్ రెడ్డి, వెంకటరెడ్డి, ధనార్జన పాల్గొన్నారు.










