టీబీపై అవగాహన కల్పిస్తున్న మధురవాడ పిహెచ్‌సి వైద్య సిబ్బంది
ప్రజాశక్తి-మధురవాడ : మధురవాడ పిహెచ్‌సి ఆధ్వర్యాన కొమ్మాది రైతుబజార్‌లో రైతులకు, వినియోగదారులకు టీబీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పిహెచ్‌సి టీబీ విభాగం సిబ్బంది మాట్లాడుతూ, రెండు వారాలకు మించి దగ్గు, సాయంత్రం పూట జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, కఫంతో పాటు రక్తం పడటం తదితర లక్షణాలు ఉంటే దగ్గరలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్ సలహాతో పరీక్ష చేయించుకోవాలని సూచించారు. కఫం పరీక్షలు ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. కఫ పరీక్షలో టీబీ నిర్ధారణ అయితే ఆరు నెలల పాటు మందులు ఉచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ మేరకు కరపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో డిపిఎమ్‌ఒ ప్రసాద్, ఎస్‌టిఎస్ సురేష్, ల్యాబ్ సూపర్‌వైజర్ వీరబ్రహ్మం, సిబ్బంది అనూష, అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.










