సీతంపేట: రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు ఏర్పాటైతే మార్కెటింగ్, వస్తువు విలువ ఆధారిత అభివృద్ధి జరుగుతుందని నాబార్డ్ జిల్లా డెవలప్మెంట్ మేనేజర్ (డిడిఎం) టి.నాగార్జున అన్నారు. మండలంలోని గజ్జలి నౌగడ, పొల్ల గ్రామాల్లో ఆర్ట్స్ సంస్థ నాబార్డ్ సహకారంతో ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను శుక్రవారం పరిశీలించారు. సీతంపేట నాబార్డ్ నుంచి ట్రైనీ టీం సభ్యులు కె వినరు, అక్షరు వర్ధన్, ప్రెగల్ గుల్హని రైతు ఉత్పత్తిదారులు నిర్వహించిన కార్యక్రమాలు పరిశీంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు ప్రస్తుత పరిస్థితి కాలంలో ఎంతో అవసరం ఉందని, సమిష్టిగా మార్కెటింగ్ విలువ ఆధారిత శిక్షణ ద్వారా అభివృద్ధి చేయాలని తెలిపారు. అనంతరం కలెక్షన్ సెంటర్లో కొండచీపుర్లు, జీడి, పసుపు, పైనాపిల్‌తో జాము వస్తువు విలువదారిత గురించి, అలాగే నిర్వహణ ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు. ఆర్ట్స్ సంస్థ డైరెక్టర్ నూక సన్యాసిరావు మాట్లాడుతూ భవిష్యత్తులో రైతు ఉత్పత్తి కంపెనీ ఏర్పాటు చేయడం మార్కెటింగ్ ప్రాసెసింగ్ యూనిట్లు.రైతులకు శిక్షణ ఇవ్వడం ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకునే సేంద్రియ వ్యవసాయ పద్ధతిగా సమీకృత వ్యవసాయ విధానం ద్వారా అభివృద్ధి చేయాలని అన్నారు. రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో శిక్షణా కార్యక్రమాలు ఇప్పించి మరింత ముందుకు తీసుకొని రావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా మేకవలో వెదురుతో బొమ్మలు తయారీ కేంద్రం వద్ద రైతులతో సమావేశమయ్యారు. అలాగే మండలో వాటర్ షెడ్ ద్వారా ఏర్పాటైన చెరువుల్లో చేపల పంపకాన్ని గట్లుపై కూరగాయలు సాగు పైన రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో రైతు ఉత్పత్తిదారుల కంపెనీ డైరెక్టర్లు, ఆర్ట్స్ కోఆర్డినేటర్ అనూప్, సిఇఒ బి.శంకర్రావు, రైతులు పాల్గొన్నారు










