Jun 05,2023 17:47

సబ్సిడీ వేరు శనగ పంపిణి చేస్తున్న వైసీపీ నాయకులు

రైతు సుభిక్షమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజాశక్తి -ప్యాపిలి

రైతుల సుభిక్షమే ప్రభుత్వ ధ్యేయం అని జడ్పీటీసీ బోరెడ్డి శ్రీరామరెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ మెట్టు వెంకటేశ్వరరెడ్డి, డోన్‌ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ రాజా నారాయణ మూర్తి, సచివాలయ కన్వీనర్‌ బోర మల్లికార్జున రెడ్డి అన్నారు. ప్యాపిలి పట్టణంలోని క్రింది గేరి రైతు భరోసా కేంద్రంలో రైతులకు సబ్సిడీ వేరు శనగ పంపిణి చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వేరు శనగ పూర్తి ధర 9300 సబ్సిడీ 3720 40% రైతు వాటా 5580 ఒక బస్తా ధర 1674 ఉందని, ఒక పాస్‌ పుస్తకానికి 3 పాకెట్స్‌ ఇవ్వబడునని మండలానికి 1500 క్వింటాలు వచ్చాయని కావున రైతులందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో చంద్ర శేఖర్‌ రెడ్డి, ఏడిఏ అశోక్‌ వర్ధన్‌ రెడ్డి, ఇంచార్జి ఏఓ నవీన,ప్రభాకర్‌ రెడ్డి, మైనారిటీ నాయకుడు మస్తాన్‌ ఖాన్‌, రవి, శీను, తదితరులు పాల్గొన్నారు.