Nov 07,2023 17:14

ప్రజాశక్తి-అమలాపురం
దేశానికి వెన్నెముక అయిన రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని, పలు చారిత్రాత్మకమైన సంస్కరణలను వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టి రైతులకు భరోసా అండగా నిలుస్తోందని ఎంపీ చింత అనురాధ పేర్కొన్నారు.మంగళవారం సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో నిర్వహించిన కార్యక్ర మంలో సిఎం జగన్‌ బటన్‌ నొక్కి వరుసగా ఐదో ఏడాది రెండో విడత నిధులను రూ.4 వేలు చొప్పున అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఆర్ధిక సాయాన్ని జమచేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక కలెక్టరేట్‌ నుండి వర్చువల్‌ విధానంలో పార్లమెంట్‌ సభ్యులు, జాయింట్‌ కలెక్టర్‌, అధికారులు రైతులు వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విత్తనం నుంచి పంట విక్రయం వరకు అన్ని సేవలు రైతన్న గడప వద్దనే అందించే దిశగా వన్‌ స్టాప్‌ సెంటర్లుగా రైతు భరోసా కేంద్రా లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పా టు చేసిందన్నారు. వివిధ రకాల సేవలు ఆర్‌బికెల ద్వారా అందు బాటులోకి వచ్చాయన్నారు. గడచిన అయిదేళ్లగా అమలు చేస్తున్న డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పిఎం కిసాన్‌ పథకం నిధులను చెల్లించడం జరుగు తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ 7,500లు కేంద్ర ప్రభుత్వం రూ.6వేలు లు ఈ పథకానికి సమకూరుస్తున్నాయన్నారు. సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్‌సి, ఎస్‌టి, బిసి మైనారిటీ కౌలు రైతులు, అటవీ, దేవాలయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు వైయస్సార్‌ రైతు భరోసా-పిఎం కిసాన్‌ కింద పంట పెట్టుబడి ఖర్చుల భారాన్ని తగ్గించేం దుకు ఏటా మూడు విడతలలో మొత్తం రూ.13500 సాయాన్ని ప్రభుత్వాలు అందిస్తున్నాయని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజరు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తం గా ఈ ఏడాది రెండో విడతగా 1,65,382 మంది రైతన్నలకు రూ.4 వేల చొప్పున మొత్తం రూ. 68 కోట్ల 3 లక్షలు అందించారన్నారు. ఇ-క్రాప్‌, ఇ-కెవైసి ఆధారంగా రూపొందించిన వెబ్‌ ల్యాండ్‌ ఆధారంగా వ్యవసాయం చేస్తున్న భూమి యజమానులతో పాటు పంట సాగు హక్కు ప్రతాలున్న రైతులకు కూడా ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకాన్ని అందజేస్తోం దన్నారు. సాగు కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి రాకుండా ఈ రైతు భరోసా నిధులు రైతాంగానికి ఎంతో మేలు చేకూర్చుస్తున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి కుడిపూడి సూర్యనారాయణరావు, రాష్ట్ర అగ్రిమిషన్‌ సభ్యులు జిన్నూరి రామారావు, జెడ్‌పిటిసి సభ్యులు పందిరి శ్రీహరి, ఎంపిపి కుడిపూడి భాగ్యలక్ష్మి, ఉద్యాన బోర్డు సభ్యుడు వెంకటేశ్వరరావు, వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ ఛైర్మన్‌ దంగేటి డోలమణి రుద్ర, పురపాలక సంఘ ఛైర్‌పర్సన్‌ రెడ్డి సత్య నాగేంద్రమణి, వక్స్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌ జిల్లా వ్యవసాయ అధికారి బోసు బాబు ఎడిలు నాగేశ్వరరావు వెంకట రామారావు, షంషి, పలువురు జెడ్‌పిటిసి సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.