
రాయచోటి : రైతు బాగుంటే రాష్ట్రం అభివద్ధి చెందుతుందని ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అధిక నిధులు ఖర్చు చేస్తూ వారి అభివద్ధికి కషి చేస్తామని కలెక్టర్ గిరీష పేర్కొన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరుసగా ఐదవ ఏడాది మొదటి విడతగా కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా 2023 మే నుండి ఆగస్టు నెల వరకు కురిసిన అధిక వర్షాలకు నష్టపోయిన రైతన్నలకు ఇన్‌ఫుట్ సబ్సిడీ రైతుల ఖాతాలకు జమ చేసే బహత్తర కార్యక్రమాన్ని ప్రారం భించారు. విసి హాల్ నుంచి కలెక్టర్, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు పంజం సుకుమార్ రెడ్డి, జెసి ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువగా బొప్పాయి, అరటి పంటలు సాగు చేశారని, పంట వేసి నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందజేయడంతో రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తు న్నారని చెప్పారు. రైతులు పంట వేసినప్పటినుంచి ధాన్యం ఇంటికి వచ్చేవరకూ ప్రభుత్వం అండగా ఉంటూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తు న్నారని చెప్పారు. రైతు బాగుంటే దేశం అభివద్ధి చెందుతుందనే ఉద్దేశంతో రైతు సంక్షేమానికి ప్రభుత్వం విశేష కషి చేస్తుందన్నారు. ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో రైతులకు అధిక నిధులు ఖర్చు చేస్తోందని తెలిపారు. రైతులు పంట వేసి నష్టపోయినట్లయితే వెంటనే వారికి ఇన్సూరెన్స్ ద్వారా నష్టపరిహారం ఇస్తారని చెప్పారు. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఎరు వులు, విత్తనాలు, పురుగు మందులు ఇస్తారన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశేష కషి చేస్తున్నా రన్నారు. ఇది రైతుల ప్రభుత్వమని రైతు చల్లగా ఉంటే రాష్ట్ర కూడా అభివద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఉచిత విద్యుత్తు, ఇన్‌ఫుట్ సబ్సిడీ, పెట్టుబడి రాయితీల ద్వారా రైతులు ఎక్కడ నష్టపోకుండా అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి రైతుకు రైతు భరోసా అందజేస్తున్నారని తెలిపారు. గతంలో ఎరువులు, విత్తనాలు పురుగు మందులకు మండల కేంద్రాలలో క్యూలు కట్టి సక్ర మంగా విత్తనాలు, ఎరువులు రాక ఇబ్బందులు పడే వారని, ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే సబ్సిడీ విత్తనాలు ఇస్తున్నారని తెలిపారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అనేక సబ్సిడీలు ఇస్తోందన్నారు. రైతులందరూ ప్రభుత్వ సబ్సిడీలను సద్విని యోగం చేసుకొని అభివద్ధి చెందారన్నారు. జిల్లాలో 1280 మంది కౌలు రైతులకు వైఎస్‌ఆర్ రైతు భరోసా కింద రూ. 96 లక్షలు రైతుల ఖాతా లకు జమ చేశారన్నారు. ఖరీఫ్ 2023 మే నుండి ఆగస్టు నెల వరకు కురిసిన అధిక వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ 1326 మంది రైతులకు రూ.2.12 కోట్లను రైతుల ఖాతాలకు జమ చేశారని చెప్పారు. జిల్లాలోని 1280 మంది కౌలు రైతులకు వైయస్సార్ రైతు భరోసా కింద మెగా చెక్కు, ఖరీఫ్ 2023 మే నుండి ఆగస్టు నెల వరకు కురిసిన అధిక వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన మెగా చెక్కును రైతులకు అందజేశారు. మున్సిపల్ చైర్మన్ ఫయా జ్ బాషా, ఎంపిపి సుదర్శన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి చంద్ర నాయక్, జిల్లా ఆర్టికల్చర్ అధికారి రవిచంద్రబాబు పాల్గొన్నారు.