రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం- జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పంజం సుకుమార్‌రెడ్డి
రాయచోటి : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పంజం సుకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రకతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ 2022లో పంట నష్టపోయిన రైతులకు వైఎస్‌ఆర్ బీమా ద్వారా వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి శనివారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నగదు జమ చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నారాయణ కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన ఆయన మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కషి చేస్తున్నారని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పంట సాగుకు ముందే పెట్టుబడి సాయం అందజేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. తుఫాన్లు అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసే లోగానే పరిహారం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కూడా జగనే అని అన్నారు. చెప్పిన దానికంటే మరింత ఎక్కువ మేలు చేసే నాయకుడు మన ముఖ్యమంత్రి అని కొనియాడారు. రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవడం జరుగుతుందని చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం రైతులకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ వ్యవసాయాన్ని అభివద్ధి చేస్తున్నారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఇంటి ముంగిటనే వివిధ రకాల సేవలు అందుతున్నాయని, వ్యవసాయ, ఉద్యానవన అధికారులు రైతులు ఇంటి వద్దకే వచ్చి సలహాలిస్తున్నారు. దేశంలోనే ఉచిత పంటల బీమా అమలు చేయడం మన రాష్ట్ర మొదటిదని చెప్పారు. మన జిల్లాకు సంబంధించి రూ. 9 కోట్ల 89 లక్షల నిధులు విడుదల చేశారని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి బి.చంద్ర నాయక్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవీంద్ర బాబు ఉచిత పంటల బీమా ఆవశ్యకతను, లబ్ధి పొందే విధానాన్ని వివరించారు. అనంతరం రైతులకు మెగా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఎఐసిసి డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి , లక్కిరెడ్డిపల్లి జడ్‌పిటిసి సభ్యులు రమణ , రైల్వే కోడూరు జడ్‌పిటిసి సభ్యులు రత్నమ్మ , ఎఎంసి చైర్మన్ లక్కిరెడ్డిపల్లి విశ్వనాథ్ రెడ్డి ,రైల్వే కోడూరు ఎఎంసి చైర్మన్ సుబ్బ రామరాజు, రాయచోటి ఎఎంసి చైర్మన్ వెంకటేశ్వర్లు, వ్యవసాయ సలహా మండల సభ్యులు దీన్నే పాడు రవిరాజు, బోదేశావళి రైతులు, గ్రామస్థాయి సిబ్బంది, సహాయ వ్యవసాయ సంచాలకులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.










