నిమ్మనపల్లి : రైతు సంక్షేమమే ప్రభత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నవాజ్‌బాషా పేర్కొన్నారు. బుధవారం రెడ్డివారిపల్లి గ్రామ సచివాలయం వద్ద మండల వ్యవసాయ అధికారి మురళిమోహన్, సర్పంచ్ రెడ్డమ్మ, నరేంద్రరెడ్డి ఆధ్వర్యంలో రైతులకు రాయితీపై ఉలవ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే నవాజ్‌బాషా, ఎడిఎ దీక్షాకుమారి, ఎంపిపి నరసింహులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అధికా రం చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలిపారు. అదే విధంగా రైతుల అభి వద్ధిని ఆకాంక్షిస్తూ రైతు భరోసా, పంటలబీమా, ఇన్‌పుట్ సబ్సిడీ వంటివి రైతులకు నేరుగా అందిస్తున్నారని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్లో వేరు శనగ పంటలు సాగు చేయని రైతులకు, బీడుగా ఉన్న భూములలో వర్ష ఆధా రంగా ఉలవ పంటను సాగు చేయడా నికి ప్రభుత్వం రాయితీపై ఉలవ విత్త నాలను అందిస్తోందన్నారు. ఒక్కొక్క రైతుకు రూ.1080లువిలువగల పది కిలోల బస్తాను 80 శాతం రాయితీతో కేవలం రూ.216 లకు అంది స్తుంద న్నారు.1600 మంది రైతులు ఉలవ విత్తనాల కోసం ఇదివరకే రిజిస్ట్రే షన్ చేసుకోవడం జరిగిందని, వారందరికీ ఉలవలను పంపిణీ చేస్తున్నట్లు తెలి పారు.అవసరమైన రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించి రిజి స్ట్రేషన్ చేసుకుని ఉలవలను తీసుకొని సద్వినియోగం చేసుకో వాలన్నారు.
లబ్దిదారులకు పింఛన్లు
మండలంలో నూతనంగా మంజూరైన పింఛన్లను ఎమ్మెల్యే నవాజ్‌బాషా పంపిణీ చేశారు. బుధవారం రెడ్డివారిపల్లి సచివాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని రెడ్డివారిపల్లి గ్రామంలో నూతనంగా మంజూరైన 28 వివిధ పింఛన్లను పింఛనుదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు రెడ్డిశేఖర్ రెడ్డి, వైస్ ఎంపిపి జయప్రకాశ్‌రెడ్డి, మండల ఇన్‌ఛార్జి ఆర్‌ఐ రమణారెడ్డి, మండల సచివాల యాల కన్వీనర్ రామమోహన్ రెడ్డి, తమశీల్దార్ సిఆర్ మంజుల, ఎంపిడిఒ శేషగిరిరావు, పంచాయతీ కార్యదర్శి ఎర్రమల్లయ్య నాయుడు, సర్పంచులు సుబ్రమణ్యం, చెండ్రాయుడు, వైసిపి నాయకులు నరేంద్రరెడ్డి, విజరు కుమా ర్‌రెడ్డి, యుగంధర్‌రెడ్డి, రైతులు, వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.










