ముప్పాళ్ల: హరిత విప్లవ పితామహుడు,వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ మతి దేశ రైతాంగానికి తీరనిలోటని రైతు సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్ అన్నారు.మండల కేంద్రంలో శనివారం ఎంఎస్ స్వామినాథన్ సంస్మరణ సభ నిర్వహించారు. స్వామినాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గోపాల్ మాట్లాడుతూ వ్యవ సాయ రంగంలో రైతు సంక్షేమానికి స్వామినాథన్ ఎంతో కృషి చేశారని అన్నారు. వ్యవసాయ రంగంలో ఎన్నో విఫ్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఘనత ఆయనదన్నారు. మాదలలో జరిగిన జరిగిన స్వామినాథన్ సంస్మరణ సభలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి బాలకృష్ణ పాల్గొన్ని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు గారా జాలయ్య, కందిమళ్ళ సాంబశివరావు,తొరటి అమరలింగేశ్వరరావు, నరసింహారావు,మార్పుల వెంకటరెడ్డి, పఠాన్ సైదాఖాన్, కంచర్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు










