
ఫిరంగిపురం: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఫిరంగిపురం మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని రైతుల సమస్యలపై తహశీల్దార్‌కు సోమవారం అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకులు వెంగల్‌రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ సెప్టెం బర్ తో ముగియనుందని, ఇప్పటివరకూ రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు,ఎరువులు,వ్యవసాయ యంత్రాలు,పరికరాలు ప్రభుత్వ సబ్సిడీలపై అందించిన దాఖలాలు లేవని విమర్శించారు. ఎండకు ఎండిపోతూ ఒక పక్కన ఏ పంట వేసుకోవాలనే అయోమయ స్థితిలో రైతులు ఉన్నారని అన్నారు. ఆరేళ్లుగా సక్రమంగా పంటల పండకపోవడ, పండించిన పంటకు సరైన ధరలు రాక పోతుండటంతో రైతులు అప్పులు తీర్చలేక ఆత్మ హత్యలకు పాల్ప డుతున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు రుణమాఫీ చేస్తే కానీ ప్రస్తుతం రైతులు సాగు చేయలేరని అన్నారు. రైతులకు,కౌలు రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని, రైతులకు ప్రభుత్వమే బీమా సౌకర్యం కల్పించాలని, భూ యజ మాని తో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, బ్యాంకు రుణాలు, సబ్సిడీలను అందించాలని, ఉపాధి హామీ పథకంలో అదనంగా వంద రోజులు పనులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మండల కమిటీ నాయకులు సిహెచ్ వెంకటేశ్వర్లు, బాల్ రెడ్డి, సిహెచ్ సాంబశివరావు, ఏ అంకమ్మ రావు, జి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.