ప్రజాశక్తి-యస్.రాయవరం: రైతన్నల సమస్యలపై జనసేనతో కలసి పోరాటం చేస్తామని తెదేపా మహిళా అధ్యక్షురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు. శుక్రవారం సైతారుపేట గ్రామం నుండి యస్.రాయవరం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ, కరువుతో అల్లాడుతున్న రైతాంగానికి తెదేపా పార్టీ అండగా ఉంటుందన్నారు. సాగునీరు అందక రైతాంగం అల్లాడుతున్నారని, వరహానదిలో గ్రోయిన్లు శిధిలావస్థకు చేరడంతో పంటలకు నీరందక ఎండిపోతున్నా పట్టించుకునే నాధుడే లేడన్నారు. ఎకరాకు ముప్ఫ్తె వేల రూపాయలు పెట్టుబడి పెడితే ఇరవై బస్తాలు దిగుబడి రాని పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు హాయాంలో రైతులకు యాభై వేల లోపు తక్షణమే రుణమాఫీ చేయగా, లక్ష దాటిన వారికి దశల వారీగా చేశారని గుర్తు చేశారు. అనంతరం పాదయాత్రగా వచ్చి తహశీల్ధారుకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో తెదేపా మండల పార్టీ అధ్యక్షులు అమలకంటి అబద్ధం, కొప్పిశెట్టి వెంకటేష్, జానకి శ్రీను, పెదిరెడ్డి చిట్టిబాబు, మాజీ ఎంపిపి యేజర్ల వినోద్ రాజు కోన అప్పలరాజు, శంకర్, రవి, రమణ బాబు పాల్గొన్నారు.