ప్రజాశక్తి - జీలుగుమిల్లి
రైతుల సమస్యలపై జనసేన నిరంతరం పోరాటం చేస్తుందని ఆ పార్టీ పోలవరం నియోకవర్గ ఇన్‌ఛార్జి చిర్రి బాలరాజు అన్నారు. శుక్రవారం జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా కామయ్యపాలెంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం కౌలు రైతులను గాలికి వదిలేసిందన్నారు. ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు వేల మంది కౌలు రైతులకు సొంత డబ్బులు ఒక్కో రైతుకి రూ.లక్ష అందించారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పసుపులేటి రాము, ఉపాధ్యక్షులు కొప్పుల శ్రీకాంత్, కర్రిపోతుల రాజకుమార్, ప్రధాన కార్యదర్శి బండారు అనిల్, వీరంకి వెంకటేశ్వరరావు, ఉలవల మధు, కోలా మధు, డేవిడ్ రాజు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : జనసేన పార్టీ రైతులకు అండగా ఉంటుందని చింతలపూడి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ మేకా ఈశ్వరయ్య అన్నారు. శుక్రవారం జాతీయ రైతు దినోత్సవాన్ని వేగవరంలో పొగాకు రైతు అనిశెట్టి వెంకన్నబాబు తోటలో మండల అధ్యక్షులు ఆకుల రాకేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు మొటేపల్లి బసవరాజు, స్థానిక ఎంపిటిసి కుక్కల సత్యనారాయణ, జనసేన జిల్లా కార్యదర్శి గురుజు ఉమామహేశ్వరి, వీర మహిళ కోసూరి కనకమహాలక్ష్మి, షేక్ పీరు, చందు పాల్గొన్నారు.
భీమడోలు : జాతీయ రైతు దినోత్సవాన్ని జనసేన ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భీమడోలులోని వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి రైతులను కలిశారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.










