Nov 14,2023 23:44

ప్రజాశక్తి-అమలాపురం రూరల్‌
జిల్లాలో వ్యవసాయ భూములకు గత నెల నుంచి నీటి కొరతతో నీరు అందడం లేదని, పంట చేలు ఎండిపోతున్నాయని, రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు అధికారులను కోరారు. మంగళవారం ఎంపిపి కుడుపూడి భాగ్యలక్ష్మి అధ్యక్షతన అమలాపురం మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంఎల్‌సి ఐవి పాల్గొని మాట్లాడుతూ బాలల దినోత్సవం, నెహ్రూ జయంతి సందర్భంగా నెహ్రూ ప్రాపంచిక దక్పథాన్ని, పాలన విధానాన్ని, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అభివద్ధిని, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ప్రతిష్టాత్మక వ్యవస్థలు, వ్యవసాయం, శాస్త్ర సాంకేతిక రంగాలలో నెహ్రూ కాలంలో జరిగిన అభివద్ధిని సభ దష్టికి తీసుకువచ్చారు. అమలాపురం మండలం, ఎ.వేమవరప్పాడు ఎంపియుపి స్కూల్‌ వాష్‌రూమ్స్‌ నిర్మాణపు పనులు పూర్తి చేయాలని ఎంపిపి దష్టికి తీసుకువెళ్లిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించినందుకు ఎంపిపి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా అమలాపురం మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ప్రొటోకాల్‌ పాటించలేదని గున్నేపల్లి అగ్రహారం గ్రామ సర్పంచ్‌ పెద్దిరెడ్డి రామచందర్రావు(రాము) అధికారులను నిలదీశారు. రాము మాట్లాడుతూ ప్రొటోకాల్‌ పాటించలేదని, సభ్యులు కాని వారిని వేదికపై కూర్చోబెట్టారని ఎంపిడిఒను నిలదీశారు. గ్రామాలలో ప్రజాప్రతినిధులకు సరైన గౌరవం దక్కడం లేదని చిందాడగరువు జనసేన పార్టీ ఎంపిటిసి సభ్యురాలు మోటూరి కనకదుర్గ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లోకి అధికారులు వస్తున్నా సర్పంచ్‌లకు, ఎంపిటిసి సభ్యులకు సమాచారం ఇవ్వడం లేదన్నారు. దీనిపై చర్యలు తీసుకుంటామని ఎంపిడిఒ తెలిపారు. ఇంకా పలు సమస్యలపై సర్వసభ్య సమావేశంలో చర్చించారు. ముందుగా భారత దేశ తొలి ప్రధానమంత్రి నెహ్రూ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎంఎల్‌సి ఐవి, రాష్ట్ర బిసి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కరేళ్ల రమేష్‌ బాబు, ఎఎంసి ఛైర్‌పర్సన్‌ దంగేటి డోలామణి, జెడ్‌పిటిసి సభ్యుడు పందిరి శ్రీహరి, వైస్‌ ఎంపిపి పాలమూరి బాలకృష్ణ తదితరులు జవహర్‌ లాల్‌ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.