Sep 24,2023 21:25

జిల్లా ఉద్యానవన శాఖాధికారి పి.రవిచంద్రబాబు

రాయచోటి : జిల్లాలో రైతులందరికీ అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్క రించడమే తమ లక్ష్యమని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి పి.రవిచంద్రబాబు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో ఎలాంటి ఉద్యాన వన పంటలు సాగు చేయాలో, ఏ పంట వేస్తే లాభా లు, అధిక దిగుబడులు వస్తాయి వంటి వివరాలు ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరించారు.
అన్నమయ్య జిల్లాలో ఉద్యానవన శాఖ కార్యాలయాల వివరాలు తెలపండి?
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 9 ఉద్యానవన శాఖ కార్యాలయాలున్నాయి. రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, టి.సుండుపల్లె, రాజం పట, రైల్వేకోడూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేర ు, ములకలచెరువు ప్రాంతాలలో ఉద్యానవన శాఖ కార్యాలయాలున్నాయి.
జిల్లాలో ఉద్యానవన పంటలు సాగు విస్తీర్ణమెంత?
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉద్యానవన పంటలు ఖరీఫ్‌లో 1,43,778 ఎకరాలలో సాగు విస్తీర్ణం ఉండగా,1,12,112 ఎకరాలలో రైతులు పంటలు సాగు చేశారు. రైతులకు ఇ-క్రాఫ్‌ నమోదు ప్రక్రియ కూడా పూర్తయింది.
ఏయే పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు?
జిల్లా వ్యాప్తంగా ఉద్యానవన ఖరీఫ్‌లో 80 వేల ఎకరాలలో మామిడి, 3,200 ఎకరాల్లో టమోటా, 13 వేల ఎకరాలు అరటి, 16 వేల నిమ్మ, 2 వేల ఎకరాలు మిగిలిన కూరగాయల పంటలను రైతులు సాగు చేస్తున్నారు.
జిల్లాలో నర్సరీలు ఎన్ని ఉన్నాయి? ఏయేప్రాంతంలో ఉన్నాయి?
జిల్లా వ్యాప్తంగా 436 నర్సరీలున్నాయి. మదనపల్లె, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి ప్రాంతంలో దేవపట్ల, పీలేరు ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నాయి. నర్సరీల్లో మామిడి, బొప్పాయి, అరటి, టమోటా, ఇతర మొక్కలు అందుబాటులో ఉన్నాయి.
ఇతర రాష్ట్రాలకు ఏయే పంటలు ఎగుమతి చేస్తారు?
జిల్లా నుంచి మామిడి, అరటి, బొప్పాయి, వంటి పండ్లను ఎక్కువగా తమిళనాడు, చెన్నై, ముంబాయి పలు ప్రాంతాలకు ఎగుమతులు అవుతున్నాయి. రైతులు నాణ్యమైన పంటలను ఎగుమతి చేస్తే అధిక లాభాలు పొందవచ్చు.
అధిక దిగుబడి పొందాలింటే ఏయే జాగ్రత్తలు పాటించాలి?
రైతులు అధిక దిగుబడి కోసం శాస్త్రీయ పద్ధతి ద్వారా పంటలను సాగు చేయాలి. మంచి విత్తనాలను సేకరించుకోవాలి. పంటను ప్రతి ఏడాదీ మార్పుడి చేసుకోవాలి. కలుపు ముక్కులను తీసివేస్తూ జీవ నియంత్రణ పద్ధతులు పాటించాలి. ఉద్యానవన శాఖ అధికారులు సూచించిన మందులను వాడకం ద్వారా తెగళ్లు నియంత్ర నియంత్రించి అధిక లాభాలు పొందవచ్చు.