న్యాయం కోసం
నిలబడ్డ అడుగులు
నెలలైనా నీరశించలేదు
టియర్‌గ్యాస్ ట్రిగ్గర్లతో
చైతన్యం ఆగిపోలేదు
మేకులు
మండిన గుండెను ఆపలేదు
అయినా
మద్దతు పిలుపులు
మౌనంగానే ఉన్నాయి
దేశ రైతు పట్ల
వికారమో, ఎటకారమో
తెలియని సందిగ్ధత
నాయకుల నైజాన్ని చాటుతున్నాయి
రైతు పోరాటాన్ని చూస్తూ
కళ్లుండి చూస్తూ
కభోదులయ్యి
మద్దతు ధరంటూ
వెలుగెత్తిన నినాదాలు
చెవిటి వాని ముందు
శంఖం ఊదినట్టు
రైతు ఆశలు నిరాశల మధ్య
ఇంటిని విడిచి
పొలాల్ని మరచి
పోరు ఇంకెన్నాళ్లని
దేశ విదేశ సరిహద్దులు
రైతుకు న్యాయం కావాలి
అంటూ ఉత్కంఠంగా
ఎదురుచూస్తున్నాయి..!
* మహబూబ్ బాషా చిల్లెం, 9502000415