Jan 05,2021 09:09

గల్లీ నుండి ఢిల్లీ దాకా
పోరాటం
అన్నపూర్ణను
బతికించడమే ఆరాటం.

మీరిచ్చే పచ్చ నోట్లు
మాకొద్దు
పొలాల్ని పచ్చగా ఉంచటమే
మాకు ముద్దు.

రైతులపై
మొసలి కన్నీరెందుకు?
హక్కులపై
ఉక్కు పాదమెందుకు?

మీకు కావాలి
పదవిలో ఐదేళ్ళు
మాకు కావాలి
నోటిలో ఐదు వేళ్ళు.

తీరు మారే వరకు
పోరు ఆగదు
తీర్పు ఇచ్చే వరకు
జోరు తగ్గదు.

- కయ్యూరు బాలసుబ్రమణ్యం
సెల్‌ : 77802 77240