Oct 16,2023 22:30

రైతు గోడు పట్టదా? విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వైరు చోరీ


రైతు గోడు పట్టదా?
విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వైరు చోరీ
పొలానికి అందని నీటి సరఫరా
స్పందించని అధికారులు
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: తన పొలంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ అనుబంధ విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌ ను గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి రాగి తీగలను దోచుకెళ్లారు. ఆ ట్రాన్స్‌ ఫార్మరే పొలానికి నీళ్లు పారేందుకు ప్రధాన దిక్కు.. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఏర్పేడు మండలం చింతలపాలెం గ్రామానికి చెందిన మురుగయ్య వేడుకుంటున్నా అధికా రుల్లో ఏ మాత్రం చలనం లేదు. తీరా పోలీసులు, విద్యుత్‌ శాఖాధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ రైతుని తిప్పించు కుంటున్నారే తప్ప సమస్యను పరిష్కరించిన పాపాన పోలేదు. చింత ల పాలెం గ్రామానికి చెందిన మురుగ య్య ట్రాన్స్‌ ఫార్మర్‌ ను ఈనెల 13వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి అందులో ఉన్న రూ.5 వేలు విలువ జేసే 15 కిలోల రాగి తీగలను దోచుకెళ్లారు. దీనిపై ఆ రైతు విద్యుత్‌ శాఖ అధికారులకు, మండల పోలీసు లకు ఫిర్యాదు చేశాడు. తనకు వెంటనే న్యాయం చేయాలని కోరాడు. అయితే అధికారులు సమస్య తమ పరిధిలోది కాదంటూ ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ రైతును తిప్పించుకుంటుండటం విమర్శ లకు తావిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతా ధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధిత రైతు కోరుతున్నాడు.