Apr 11,2023 17:30

మట్టి నమూనా సేకరిస్తున్న అధికారులు.

రైతు చెంతకే భూసార పరీక్ష ఫలితాలు
జిల్లా వ్యవసాయ అధికారి  టి. మోహన్ రావు
ప్రజాశక్తి - నంద్యాల రూరల్.

     రైతు చెంతకే భూసార పరీక్ష ఫలితాలు అందుబాటులో కి తీస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి టి. మోహన్ రావు వెల్లడించారు. సోమవారం నంద్యాల మండలం పాండు రంగాపురం గ్రామం లోని ఆర్ బికే సెంటర్ లో భూసార పరీక్ష శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు ప్రారంభించారు. ఈ శిక్షణా కార్యక్రమం లో జిల్లా వనరుల కేంద్రం సిబ్బంది, సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు ఆర్.బి కే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.స్పెషల్ కమిషనర్ అగ్రికల్చర్ గారి ఆదేశాల మేరకు ఏప్రిల్ 2023 వ సంవత్సరం 2వ వారాన్ని మట్టి పరీక్ష శిక్షణ వారంగా నామకరణం చేశారు.ఈ సందర్బంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ జిల్లా భూభౌగోళిక స్థితి, నేలల సారవంతం, ఎరువుల వినియోగం పై తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా హాజరైన అధికారులందరూ 50 మట్టి నమూనా లను సేకరించి కర్నూలు లోని మట్టి పరీక్ష కేంద్రం  భూసార పరీక్ష ఫలితాల కొరకు పంపాలని ఆదేశించారు.మండల స్థాయిలో ఏడీఏ, ఎంఏవోలు ఆర్బికే సిబ్బందికి ఏప్రిల్ 15 లోపల శిక్షణ ఇవ్వాలని, ప్రతి మండలంలో ప్రతి ఆర్ బి కే నుంచి 20 మట్టి నమూనాలను సేకరించి పంపాలని  తెలిపారు.మొదటిది సాంకేతిక సెషన్, రెండవది ప్రాక్టికల్ సెషన్. రిసోర్స్ పర్సన్ గా కెవికె, యాగంటి పల్లి నుంచి భూ శాస్త్రవేత్త రమణయ్య గారు భూమి రకాలు, ప్రాముఖ్యత, జిల్లాలోని భూసార పరీక్ష పటము, భూమి సారవంతాన్ని, భూమి పరీక్షలో భాగంగా మట్టి నమూనాల సేకరణ, పరీక్షించు పద్ధతి, భూసార పరీక్షా ఫలితాలు కార్డులను రైతులకు ఇస్తూ ఇబ్బందికర పొలాలను సరి చేయుట గురించి అధికారులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు రాజశేఖర్,మండల వ్యవసాయ అధికారులు, డి ఆర్ సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.