
ప్రజాశక్తి -యంత్రాంగం
రైతు భరోసా నిధులను విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో మంగళవారం పంపిణీచేశారు.
ఆనందపురం : ఆనందపురం మండలం బోని గ్రామంలో రైతు భరోసా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.11.82 కోట్లు చెక్కును రైతులకు జాయింట్ కలెక్టర్ కెఎస్.విశ్వనాథన్, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అందించారు. అనంతరం భీమిలి నియోజకవర్గంలోని ఉత్తమ రైతులను సన్మానించారు.
బోని గ్రామంలో రూ.17.50 లక్షలతో నిర్మించిన విలేజి క్లినిక్, రూ.21.85 లక్షల నిర్మించిన రైతు భరోసా కేంద్రాలను వారిరువురు ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒ భాస్కరరెడ్డి, వ్యవసాయశాఖాధికారులు, వైసిపి జిల్లా అధ్యక్షులు కోలా గురువులు, విశాఖ అగ్రి ఎడ్వైజరీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెదబాబు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోని అప్పలనాయుడు, బోని సర్పంచ్ బోని అప్పలకొండ, ఎంపిటిసి సభ్యులు బోని పార్వతి పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లాలో
రూ.109.77 కోట్లు జమ
అనకాపల్లి : అనకాపల్లి జిల్లాలో 2 లక్షల 65 వేల 778 మంది రైతు లబ్ధిదారులకు రూ.109.77 కోట్లు రైతు భరోసా జమ అయినట్లు జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు. మంగళవారం స్థానిక వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీతో కలిసి రైతులకు ''రైతు భరోసా పిఎం కిసాన్'' చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి నగదు విడుదల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి మోహన్‌రావు, బుచ్చయ్యపేట జెడ్‌పిటిసి దొండా రాంబాబు, డిసిఎంఎస్ చైర్మన్ పల్లా నర్సింగరావు, కశింకోట వైస్ ఎంపిపి పెంటకోట జ్యోతి, తుమ్మపాల సర్పంచ్ తట్టా పెంటయ్య నాయుడు పాల్గొన్నారు.