
చెక్కు ఆవిష్కరిస్తున్న అధికారులు
ప్రజాశక్తి-నెల్లూరు :రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా.. పిఎం కిసాన్ నగదు పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 2.19 లక్షల మందికి రూ.90.55 కోట్ల నగదును రైతుల బ్యాంకు ఖాతాలల్లో ముఖ్యమంత్రి నేరుగా జమ చేశారు. మంగళవారం సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రాంతంలో జరిగినకార్యక్రమంలో బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. అందులో భాగంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన రైతుభరోసా.. పిఎం కిసాన్ నగదు అందజేసే కార్యక్రమానికి ఎంఎల్‌సి బల్లి కళ్యాణ్ చక్రవర్తి, జడ్‌పి ఛైర్మన్ ఆనం రమణమ్మ, కలెక్టర్ ఎం. హరినారాయణన్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్‌రెడ్డిలు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు, ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు.