
రైతు భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
ప్రజాశక్తి - ఆత్మకూర్
ఆత్మకూరు మండలం పరిధిలోని కొట్టాల చెరువు.కురుకుంద గ్రామం నందు నూతనంగా నిర్మించిన వైయస్సార్ రైతు భరోసా కేంద్రం ఆదివారం నాడు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం కొన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని అందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో వైయస్సార్ రైతు భరోసా కేంద్రంలను ఏర్పాటుచేసి ప్రజలకు సూచనలు సలహాలు సంబంధించిన విషయాలకు తోడ్పడుగా ఉంటుందని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.. అంతేకాకుండా ప్రతిపక్ష నాయకులు చెబుతున్న మోసపూరిత మాటలు నమ్మొద్దని ఎక్కడా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు ఎన్నో ప్రత్యేకమైన పథకాలు ఏర్పాటు చేసి రైతులకు తోడ్పాటు అందిస్తున్నామని మన ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తెలియజేశారు అదేవిధంగా మన నియోజకవర్గంలో ఆరటి తోటలకు ఇన్సూరెన్స్ కల్పించామని అదేవిధంగా సిద్దాపురం లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో మోటర్లు రిపేర్లు ఉంటే నా యొక్క సొంత డబ్బు ఇచ్చి రైతుల పక్షాన నిలిచామని తెలియజేశారు. అంతేకాకుండా గ్రామ రైతులకు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చేతుల మీదుగా విత్తనాలు మరియు ఎరువులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడిఏ ఆంజనేయులు.ఎంపీడీవో మోహన్ కుమార్. మండల వ్యవసాయ శాఖ అధికారి విష్ణువర్ధన్ జడ్పిటిసిసభ్యులు శివశంకర్ రెడ్డి , నంద్యాల జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ భరత్ కుమార్ రెడ్డి ,మండల పార్టీ అధ్యక్షులు రాజమోహన్ రెడ్డి , ఆత్మకూరు టౌన్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ మీర్ ,గ్రామ సర్పంచ్ మహబూబ్ బి, ఎంపిటిసి రాజ్యలక్ష్మి, కలాం, మార్కెట్ యార్డ్ చైర్మన్ బాల స్వామి , సింగల్ విండో చైర్మన్ సురేష్ , ఆత్మకూరు మున్సిపల్ కౌన్సిలర్లు , మండల జెసిఎస్ కన్వీనర్ లక్ష్మి రెడ్డి గారు,గ్రామ నాయకులు నాగేశ్వర్ రెడ్డి, రామచంద్రారెడ్డి,శేషయ్య, మహబూబ్ బాషా ,మోహన్, బందెల బాబు, అలీ భాష, షఫీఉల్లా, మరియు గ్రామ గ్రామా నుంచి వచ్చిన నాయకులు మరియు ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు, వాలంటరీలు, కార్యకర్తలు సచివాల కన్వీనర్లు గృహ సారథులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...