ప్రజాశక్తి-ఫిరంగిపురం :మేరికపూడి, నుదురుపాడు గ్రామాల రైతు భరోసా కేంద్రాలను జిల్లా వ్యవసాయాధికారి నున్న వెంకటేశ్వర్లు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రబీలో పండించిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, మొక్కజొన్న వేసిన రైతులందరూ రైతు భరోసా కేంద్రాలలో తమ పేరును రిజిస్టర్ చేసుకొని తమకు కేటాయించిన తేదీలలో మీ గ్రామాలలోని మొక్కజొన్నలు సేకరిస్తారని తెలిపారు. భూసారాన్ని పెంచేందుకు ప్రతి రైతు తమ పొలాలలో పచ్చిరొట్ట పైరు సాగు చేసి 30 రోజుల తర్వాత కలియదున్నాలని తెలిపారు.దీనివలన రైతులకు ఎరువుల భారం తగ్గటంతో పాటు నాణ్యమైన పంటల ఉత్పత్తిని పొందవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ వ్యవసాయ అధికారి ఓ సునీల్ కుమార్, మండల వ్యవసాయ అధికారి కే. రమణ కుమార్ , వ్యవసాయ విస్తరణ అధికారులు , గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొన్నార










