Nov 22,2022 23:59

బుచ్చయ్యపేటలో మాట్లాడుతున్న వ్యవసాయాధికారి భాస్కరరావు

ప్రజాశక్తి- అనకాపల్లి : రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నట్టు మండల వ్యవసాయ అధికారి రంగాచారి తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ధాన్యం కొనుగోలుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్‌ 17 నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామన్నారు. గ్రేడ్‌ వన్‌ రకం క్వింటాలకు రూ.2,060, సాధారణ రకం క్వింటాలకు రూ.2,040గా ప్రభుత్వం ధర నిర్ణయించిందన్నారు. ధాన్యం అమ్మాలనుకునే రైతు నమూనాలను రైతు భరోసా కేంద్రాలకు తీసకొచ్చి పరీక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు పీవీఎల్‌ఎన్‌ గంగాధర్‌రావు, ఆత్మ రామకృష్ణ, ఏఈఓ గణేష్‌, గ్రామ రెవెన్యూ అధికారులు, వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట : ధాన్యం కొనుగోలుపై రైతులకు గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ రెవెన్యూ అధికారులు, వాలంటీర్లు అవగాహన కల్పించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి బి భాస్కరరావు అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో మండలంలోని రైతు భరోసా కేంద్రాల వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ధాన్యం కొనుగోలు, ప్రభుత్వ మద్దతు ధర, ధాన్యం నాణ్యత తదితర అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
మునగపాక రూరల్‌ : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు బాబ్జి, ఎంపీడీవో రవికుమార్‌, వ్యవసాయాధికారిని జోష్నా కుమారి, ఎంపీపీ మళ్ల జయలక్ష్మి, అగ్రికల్చరల్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.