Feb 23,2023 23:53

చేపడుతున్న అమ్మకాలు

ప్రజాశక్తి -విశాఖపట్నం:నగరంలోని రైతు బజార్లలో గిరిజన సహకార సంస్థ (జిసిసి) తమ స్టాల్స్‌లో గిరిజన్‌ పిక్క చింతపండును అమ్మకానికి పెట్టింది. గురువారం ఉదయం సీతమ్మధార రైతు బజార్లోని జిసిసి స్టాల్‌లో చింతపండు అమ్మకాలను జిసిసి మార్కెటింగ్‌ జనరల్‌ మేనేజర్‌ సురేంద్రకుమార్‌ ప్రారంభించారు. మూడు కేజీల పిక్క చింతపండు ప్యాకెట్‌ను రూ.130కు, ఐదు కేజీల పిక్క చింతపండు ప్యాకెట్‌ను రూ.215కు జిసిసి అమ్ముతోంది.