మాట్లాడుతున్న పిఒ అభిషేక్
ప్రజాశక్తి-పాడేరు టౌన్: స్థానిక రైతు బజారును వినియోగంలోకి తీసుకురావాలని ఇన్చార్జి సబ్ కలెక్టర్, ఐటిడిఎ పిఒ వి.అభిషేక్ ఆదేశించారు. అంబేద్కర్ కూడలిలో ఉన్న రైతు బజారును, రహదారుల భవనాల శాఖ నివాస సముదాయంలో ఉన్న ఖాళీ స్థలాన్ని రెవెన్యూ అధికారులు, ఎంపిడిఒ, సచివాలయం సిబ్బందితో కలిసి శనివారం పరిశీలించారు. చిరు వ్యాపారులకు మార్కెట్ సదుపాయాలు కల్పించడానికి అనుకూలతలు పరిశీలించి నివేదించాలని సూచించారు. స్థానికంగా మార్కెట్ ఏర్పాటు చేయడానికి సత్వర చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు తాహశీల్దార్ వి.త్రినాధరావు నాయుడు, ఎంపిడిఒ, పంచాయతీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.










