ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పట్టణంలో రైతు బజార్ ఏర్పాటు చేయడంలో స్థానిక ఎమ్మెల్యే విఫలం చెందారని, తక్షణమే స్పందించి రైతు బజార్ ఏర్పాటు చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పంపన్న గౌడు, సిపిఐ పట్టణ కార్యదర్శి జి.రంగన్న డిమాండ్ చేశారు. కూరగాయల ధరలు పెరగడంతో ఆదివారం సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో స్థానిక సోమప్ప సర్కిల్‌లో కూరగాయల దండలతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కూరగాయల ధరలను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. కూరగాయలను కొనాలంటే పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి బాలరాజు, మహిళా సమాఖ్య నాయకులు ఈరమ్మ, నాగవేణి, సరోజ, ప్రజాసంఘాల నాయకులు విజయేంద్ర, రాజీవ్, ఖాజా, దాదావలీ, మల్లికార్జున గౌడ్, నరసింహులు, సుంకన్న, సునీల్, శాంతప్ప, మాలిక్, హనుమంతు, ఆంజనేయ, ఖాదర్, ఇస్మాయిల్, మల్లికార్జున, కృష్ణ, రమేష్, లచ్చప్ప, వీరేష్, నాయుడు, రామాంజనేయులు పాల్గొన్నారు.
నిరసన తెలియజేస్తున్న నాయకులు










