Aug 29,2021 09:26

భారతావని ఉదరాన్ని
ఉత్తేజపరచడానికి
మట్టి గర్భాన్ని చీల్చుకొని తను
ఓ రైతు మొక్కగా మొలిచాడు ...

పంచభూతాలను ఆధారంగా
చేసుకొని దిన దినం
ప్రవర్థమానమై తను
ఓ కర్షక చెట్టుగా ఎదిగాడు ...

తన కుటుంబ సభ్యులనే
కొమ్మలు కొమ్మలుగా
మల్చుకొని
భరత మాత కడుపును
నిండు కుండలా నింపే తను
ఓ కిసాన్‌ వృక్షమై
విస్తరించాడు ...

ఎన్ని కష్టాల సునామీలచ్చినా
ఎన్ని కన్నీటి వరదలచ్చినా
ఎన్ని బాధల భూకంపాలచ్చినా
భారతమాత ఆకలి తీర్చే తను
ఓ వ్యవసాయ మానై నిలిచాడు ...

కానీ ..!
స్వాతంత్య్రం సిద్ధించి
ఏడు శతాబ్దాలు గడిచినా
ఆ రైతు వృక్షం మాత్రం
గిట్టుబాటు ధరలు లేక,
నకిలీ విత్తనాలతో
మోడుబారిపోయింది ...

మన పాలకులు ఎల్లప్పుడూ
ఆ మోడుబారిన రైతు
వృక్షానికి చిగురులు తొడిగి
పచ్చగా, రక్షణగా ఉంచాలని
వేడుకుందాం...
జై కిసాన్‌ అను పదానికి
విలువల తోరణం కడదాం ...

- బోనగిరి పాండురంగ, 83412 12132