
ప్రజాశక్తి-మార్కాపురం
రైతన్నలకు అండగా జగనన్న ప్రభుత్వం నిలుస్తోందని మార్కాపురం శాసనసభ్యులు కుందురు నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఎఎంసి చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన పత్తి కొనుగోలు కేంద్రాన్ని (సిసిఐ) ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ పత్తి కొనుగోలు కేంద్రాన్ని పత్తి పంట సాగు చేసిన రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గిట్టుబాట ధర కల్పించేందుకు కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతు భరోసా కేంద్రాలు కూడా రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకష్ణ, వైస్ చైర్మన్ షేక్ ఇస్మాయిల్, మార్కెట్ యార్డు కార్యదర్శి కోటేశ్వరరావు, ఎఎంసి డైరెక్టర్లు, వైసిపి నాయకులు పోరెడ్డి చెంచిరెడ్డి, చాతరాజుపల్లి శ్రీనివాసులు, మండల జేఏసీ కన్వీనర్ పొందుగుల శ్రీనివాసరెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం కన్వీనర్ గుంటక సుబ్బారెడ్డి, తాడిపత్రి చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.