Jul 11,2023 22:01

రైతు భరోసా కేంద్రానికి తాళం వేసి నిరసన తెలుపుతున్న రైతులు

కలసపాడు : ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా మంజూరు కాకపోడం, పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో రైతన్నలు ఆగ్రహించారు. తమకు వెంటనే బీమా మంజూరు చేయించాలని, అలసత్వానికి కారణమైన వ్యవసాయ విస్తరణాధికారిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. వివరాలు.. మండలంలోని లింగారెడ్డిపల్లెకు చెందిన సుమారు 200 మంది రైతులు మంగళవారం రైతు భరోసా కేంద్రానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. సచివాలయానికి, రైతు భరోసా కేంద్రానికి తాళాలు వేసి సుమారు రెండు గంటల పాటు అధికారుల విధులను అడ్డు కున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నాగమురళీ హుటాహుటీనా సంఘ టనా స్థలానికి వెళ్లి రైతులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అధికా రులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ లింగారెడ్డిపల్లె సచివాలయ పరిధిలోని పత్తి రైతులకు 2022 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రావాల్సిన ఈ క్రాఫ్‌ ఇన్సూరెన్స్‌ డబ్బులు స్థానికులకు పడలేదని పేర్కొన్నారు. గ్రామ వ్యవసాయ విస్తరణాధికారి ఉమా మహేశ్వరి ఎరువులు, విత్తనాల సమాచారం కూడా తమకు అందించడం లేదని వాపోయారు. ఆమె బంధుగణానికే మేలు చేసేలా విధులు నిర్వహి స్తున్నారని ఆరోపించారు. ఈ క్రాఫ్ట్‌ బుకింగ్‌లో అవకతవకలకు పాల్పడ్డారని, వెంటనే ఆమెను విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై మండల వ్యవసాయాధికారి షరీఫ్‌ మాట్లాడుతూ విస్తరణాధికారిపై వచ్చిన అభియోగాలను పరిశీలించి, అవకతవకలుంటే చర్యలు తీసుకు ంటామని చెప్పారు. పంట నమోదు చేసుకున్న వారందరికీ న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.