Jun 04,2023 22:32

ప్రజాశక్తి -కరప, జగ్గంపేట వైసిపి అధికారంలోకి వచ్చాక వ్యవసాయ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసి రైతులను నట్టేట ముంచారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి, కాకినాడ రూరల్‌ మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంత లక్ష్మీ సత్యనారాయణ మూర్తి విమర్శించారు. ఆదివారం గొర్రిపూడిలో చంద్రబాబు చిత్రపటానికి ధాన్యాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత లక్ష్మీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ... రైతుల పంటలకు గిట్టుబాటు ధర లభించక ఆర్థికంగా కుదేలవుతున్నారని, అధికారం రాకముందు రైతులకు ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌ రూ.మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ చేపట్టి రైతులకు మేలు చేస్తామని చెప్పిన ఇచ్చిన మాటను మరచి పోయారన్నారు. ఈ కార్యక్రమంలో గండి వెంకటేశ్వరరావు, యనమదల వెంకటలక్ష్మి, దొరబాబు, బుంగ సింహాద్రి, గుల్లిపల్లి శ్రీనివాస్‌, చుండ్రు వెంకన్నరావు, కోటగిరి మహేంద్ర, గొల్లపల్లి బుజ్జి, జల్దాని నూకరాజు పాల్గొన్నారు.
రైతులకు మేలు కోసమే చంద్రబాబు నాయుడు ఇటీవల నిర్వహించిన టిడిపి మహా నాడులో మేనిఫెస్టోలో పథకాలను పెట్టారని మాజీ ఎంఎల్‌ఎ జ్యోతుల నెహ్రూ అన్నారు. చంద్రబాబు చిత్రపటానికి జగ్గంపేటలో ఆదివారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.13,500 చొప్పున 67 వేల ఇవ్వాలని కానీ హామీని పక్కనపెట్టి రూ.37 వేలు మాత్రమే రైతులకు అందజేశారన్నారు. ప్రస్తుతం జగన్‌ పాలనతో ప్రజలు విసుగు చెందుతున్నారన్నారు. తాను జగ్గంపేట ఎంఎల్‌ఎగా పని చేసిన కాలంలో నాలుగు ప్రాజెక్టులను రైతులకు అంకితం చేశారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులను ఎండగట్టిందని, దానికి నిదర్శనమే నాలుగేళ్లలో ఏమీ చేయకపోవడమే అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఎస్‌విఎస్‌.అప్పలరాజు, రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు అడపా భారత్‌ బాబు, మాజీ ఎంపిపి మారిశెట్టి భద్రం, వేములకొండ జోగారావు, కొత్త కొండబాబు, రేఖ బుల్లి రాజు, రేఖ నూకరాజు, మర్రిపాక బండారు చిన్నయ్య, కాపవరపు వెంకటరాజు పాల్గొన్నారు.