Oct 28,2023 21:30

ప్రజాశక్తి - రాజానగరం మండల పరిది óలోని సంపత్‌నగరంలో రాజమహేంద్రి ఇంటర్నే షనల్‌ పాఠశాలలో శనివారం ఎపి అంతర్‌ జిల్లాల ఎస్‌జి ఎఫ్‌ రైఫిల్‌ షూటింగ్‌ టోర్న మెంటు ప్రారంభం అయ్యిం ది. ఈ కార్యక్రమానికి డివై ఇఒ ఇ.నారాయణ అధ్యక్షత వహించగా, సాప్‌ డైరెక్టర్‌ భీమిరెడ్డి నాగేంద్రుడు, డివైఇఒ కప్పల వరలక్ష్మి, ఎంఇఒలు జెవిఎస్‌ఎస్‌ సుబ్రహ్మణ్యం, ఎం.రామన్నదొర, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లంక జార్జ్‌, జిల్లా అధ్యక్షులు వి.రవిరాజ్‌, జిల్లా ఎస్‌జిఎస్‌ సెక్రటరీ ఎస్‌ఆర్‌కెవి స్వామి, రాజమహేంద్రి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఛైర్మన్‌ టికె విశ్వేశ్వర రెడ్డి, డైరెక్టర్‌ టి.స్వరూప్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన సుమారు 500 మంది క్రీడాకారులు మరియు వ్యాయామ ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచే క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధిస్తారని ఎస్‌జిఎఫ్‌ సెక్రటరీ కెవి స్వామి తెలిపారు.