* రైల్వే డిఆర్‌ఎం సౌరభ్ ప్రసాద్
ప్రజాశక్తి - ఆమదాలవలస: రైల్వేస్టేషన్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు రైల్వే డివిజనల్ మేనేజర్ సౌరభ్ ప్రసాద్ అన్నారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆయన శ్రీకాకుళం రోడ్డు రైల్వేస్టేషన్‌ను గురువారం పరిశీలించారు. రెండు, మూడు రైల్వే ప్లాట్‌ఫారాల్లో అధికారులను అడిగి పలు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం రైల్వే పారిశుధ్య కార్మికులు, క్యాంటీన్ సిబ్బంది, స్థానిక రైల్వే అధికారులతో ముచ్చటించి పలు సూచనలు చేశారు. రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ డిసిఎం త్రిపాఠి, అడిషనల్ డిసిఎం సునీల్ కుమార్, కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ గణేష్ తాప, స్టేషన్ మాస్టర్ మొదలవలస రవి, చీఫ్ బుకింగ్ సూపర్‌వైజర్ శివశంకర్, రైల్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










