Mar 14,2023 21:21

రైలు పట్టాలపై వెళ్తున్న లారీ


రైల్వే పట్టాలపై లారీ పరుగులు
ప్రజాశక్తి - బేతంచెర్ల

      గుంటూరు-గుంతకల్‌ రైల్వే ట్రాక్‌ డబుల్‌ లైన్‌ పనులు జరుగుతున్న నేపథ్యంలో భాగంగా బేతంచెర్ల మండలంలోని ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామ సమీపంలో రైల్వే పట్టాలపై లారీ పరుగులు పెటింది. ఇందుకు కారణం లారీ టైర్లకు బదులుగా రైల్వే భోగిలకు ఉండే చక్రాలు పెట్టడం. దీంతో పట్టాలపై లారీ వెళ్తుండడం చూపరులను ఆకట్టుకుంటుంది. రైల్వే పనులకు అవసరమైన వస్తువులను వర్కర్లకు అందజేసేందుకు వీలుగా రైల్వే ఇంజనీర్లు ఈ లారీని రైల్వే ట్రాక్‌పై నడిచే విధంగా తయారు చేశారు.