ప్రజాశక్తి-విశాఖపట్నం : డాల్ఫిన్ నోస్ కాలనీ, హార్బర్ కాలనీ, ప్రేమ్ భవన్‌లలో డిఆర్‌ఎం అనుప్‌కుమార్ సత్పతి ఆదివారం పర్యటించారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రాథమిక సౌకర్యాలు, పారిశుధ్యం, భద్రత, రైల్వే క్వార్టర్ల పరిస్థితిని మెరుగుపరిచేందుకు డిఆర్‌ఎం తనిఖీలు చేపట్టారు. నివాసితులతో మాట్లాడి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్లను పరిశీలించి పలు సవరణ పనులను అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఎం మాట్లాడుతూ, రైల్వే కాలనీల ఇళ్ల స్థితిగతులు, సౌకర్యాలపై ఫీడ్‌బ్యాక్, పారిశుధ్యం, భద్రత, నివాసితుల అవసరాలను తగు విధంగా పరిగణలోకి తీసుకుని వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే తనిఖీల ఉద్దేశమన్నారు. అన్ని కాలనీల్లో తనిఖీలు నిర్వహిస్తామని డిఆర్‌ఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఇంజినీర్లు పికె.మహారాణా, సిహెచ్.కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










